మత్తు కోసం హష్ ఆయిల్‌ను తీసుకుంటున్న యువత
అరకు నుంచి హైదరాబాద్‌కు..
రూ.2 వేల నుంచి రూ.3వేలకు విక్రయం
వరుసగా పట్టుకుంటున్న పోలీసులు
ఈ మధ్యకాలంలోనే కేసులు అధికం
గంజాయి స్మగ్లర్లు తమ రూటును మార్చారు.. గంజాయిని విక్రస్తున్న సమయంలో ఎక్కువగా పోలీసులకు పట్టుబడుతుండటంతో వారు తమ ఆలోచలను మార్చారు. దీంతో గంజాయికి అలవాటుపడిన వారికి మెళ్లిమెళ్లి గంజాయి ఆయిల్ (హష్ ఆయిల్)ను అలవాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హాష్ ఆయిల్‌కు ఎక్కువగా డిమాండ్ పెరిగి చిన్న ఆయిల్ సీసా వేలల్లో ధర పలుకుతోంది. అంతేకాకుండా గంజాయి రవాణా కూడా సులభతర కావటంతో పోలీసుల కళ్లుగప్పి నగరానికి తెస్తున్నారు.
మన తెలంగాణ/సిటీబ్యూరో: గంజాయి స్మగ్లర్లు తమ రూటును మార్చారు, గతంలో గంజాయిని ఎక్కువగా స్మగ్లింగ్ చేసి నగరానికి తీసుకుని వచ్చేవారు. మార్కెట్‌లో హాష్ ఆయిల్‌కు ఎక్కువగా డిమాండ్ ఉండడంతో దానిని కొనుగోలు చేసి తీసుకుని వస్తున్నారు. హాష్ ఆయిల్‌ను ఎపిలోని అరకు నుంచి కొనుగోలు చేసి తీసుకుని వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దీనిని రవాణా చేయడం కూడా సులభం కావడంతో పట్టుకుని వస్తున్నా రు. కొందరు ట్రాన్స్‌ఫోర్ట్‌లో నగరానికి తీసుకుని వస్తున్నారు. అలాగే అక్కడ లీటర్లలో కొనుగోలు చేసి ఇక్కడ అవసరం ఉన్న వారికి మిల్లీ లీటర్ల చొప్పున విక్రయిస్తున్నారు. చిన్న, చిన్న బాటాళ్లలో నింపి రూ.2,000 నుంచి రూ.3,000లకు విక్రయిస్తున్నారు. హాష్ ఆయిల్ విక్రయించేవారిలో ఎక్కువగా దానికి బానిసలుగామారిన వా రే ఎక్కువగా ఉంటున్నారు. కొంతమంది స్నేహితులు హాష్ ఆయిల్‌ను తీసుకోవడానికి అలవాటు పడ్డారు. త ర్వాత దానిని విక్రయిస్తే సులభంగా డబ్బులు వస్తాయని ప్లాన్ వేసి సేహ్నితులు కలిసి వారు అరకు నుంచి కొనుగోలు చేసి తీసుకుని వచ్చి నగరంలో అవసరం ఉన్న వా రికి విక్రయిస్తున్నారు. బోరబండకు చెందిన సంతోష్ ఫ్లిప్‌కార్ట్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. తన స్నేహితులు శోభన్ శివ, విజయ్‌కుమార్‌తో కలిసి హాష్ ఆయిల్ తరచూ తీసుకునేవాడు. ధూల్‌పేటకు చెందిన వారి వద్ద కొనుగోలు చేసేవాడు. ఈ క్రమంలో సులభంగా డబ్బులు సంపాదించాలని ముగ్గురు కలిసి ప్లాన్ వేశారు. అరకుకు చెందిన వ్యక్తి నుంచి 500 మిల్లీలీటర్ల హాష్ ఆయిల్‌ను కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చి అవసరం ఉన్న వారికి రూ.2,000, రూ. 3,000లకు విక్రయిస్తున్నారు. అలాగే సనత్‌నగర్‌కు చెం దిన ముగ్గురు స్నేహితులు ఎండి మహబూబ్ అలీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు, అబ్దుల్ అస్లాం, ఎండి హాజీ పాషా స్నేహితులు వీరు ముగ్గురు కలిసి తరచూ గంజాయి తీసుకునేవారు. దానికి బానిసలుగా మారారు, హాష్ ఆయిల్ విక్రయిస్తే డబ్బులు ఎక్కువగా వస్తాయని ప్లాన్ వేశారు. ముగ్గురు కలిసి విశాఖపట్టణం ఏజెన్సీలోని పా డేరు నుంచి రూ.6లక్షల విలువైన 1.02 లీటర్ల హాష్ ఆయిల్‌ను కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చారు. ఇక్క అవసరం ఉన్న వారికి బంజారాహిల్స్‌లో విక్రయిస్తుండగా వెస్ట్‌జోన్ పోలీసులు పట్టుకున్నారు. చందానగర్‌కు చెందిన తిరువురు రామస్వామి, ప్రమోద్‌కుమార్, రాజేష్ కలిసి 120 మిల్లీ లీటర్ల హాష్ ఆయిల్‌ను అరకు నుంచి కొనుగోలు చేసి తీసుకుని వచ్చి నగరంలోని విక్రయిస్తున్నారు. పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నగరంలోని మెహిదీప ట్నం, గుడిమల్కాపూర్‌కు చెందిన లక్ష్మివెంకట్‌నర్సింహాచారి డిజే ప్లేయర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురు కావడంతో హాష్ ఆయిల్‌ను విక్రయించాలని ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా అరకు నుంచి తక్కువ డబ్బులకు 100 గ్రాముల హాష్ ఆయిల్‌ను కొనుగోలు చేసి తీసుకుని వచ్చి నగరంలో విక్రయిస్తున్నాడు. దీనికి తన డిజే కార్యాలయాన్ని అడ్డాగా చేసుకున్నాడు, అక్కడి నుంచి అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నాడు. దీనిని తెలుసుకున్న పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఇలా పలువురు నిందితులు అవసరాలకు హాష్ ఆయిల్‌ను విక్రయిస్తున్నారు.
రూట్ మార్చిన నిందితులు….
గతంలో గంజాయిని విక్రయించిన పలువు స్మగ్లర్లు రూట్ మార్చి మార్కెట్‌లో డిమాండ్ ఉన్న హాష్ ఆయిల్‌ను విక్రయిస్తున్నారు. రవాణా సులభంగా చేయడమే కాకుండా డబ్బులు ఎక్కువగా వస్తుండడంతో దీనిని విక్రయిస్తున్నారు. అంతేకాకుండా దీనికి అలవాటు పడ్డవారు సిగరేట్‌లో రెండు చుక్కలు వేసుకుంటే కావాల్సినంత మాజా రావడంతో కస్టమర్లు కూడా ఎక్కువగా గం జాయి నుంచి హాష్ ఆయిల్‌కు మారిపోయారు. దీంతో మార్కెట్‌లో హాష్ ఆయిల్‌కు డిమాండ్ ఎక్కువగా ఏర్పడింది. దీనిని క్యాష్ చేసుకునేందుకు స్మగ్లర్లు రంగంలోకి దిగి విక్రయిస్తున్నారు.
నగరంలో నషా ముక్త్…
గంజాయి, గుట్కా, మత్తు ట్యాబ్లెట్లు తదితర వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వీటిని విక్రయిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాలను లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గతంలో గంజాయి విక్రయించిన వారిలో మా ర్పు తీసుకుని రావడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు స్మగ్లర్లపై ఉక్కు పాదం మొపుతున్నా రు. స్థానికులతో మాట్లాడి గంజాయి విక్రయాల నుంచి దూరంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ ధూల్‌పేట వాసులను కోరారు. అంతేకాకుండా వరుసగా గంజాయి విక్రేతలపై పిడి యాక్ట్ పెట్టి జైలుకు పంపిస్తున్నారు.