హైదరాబాద్: యువతులకు న్యూడ్ కాల్స్ చేసి బ్లాక్‌మేయిల్ చేస్తున్న యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….ఖమ్మం జిల్లా, కొత్తగూడెంకు చెందిన యువకుడు నకిలీ ఇన్‌స్టాగ్రాం ఐడితో పలువురు యువతులకు మెసేజ్‌లు పంపించి ఛాటింగ్ చేసేవాడు. కొద్ది రోజులు ఛాటింగ్ చేసిన తర్వాత న్యూడ్‌గా వీడియో కాల్స్ మాట్లాడి వాటిని రికార్డు చేసేవాడు. అలాగే పలువురు యువతులతో మాట్లాడి వారి సోషల్ మీడియా ఖాతాల నుంచి ఫొటోలు సేకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నకిలీ ఇన్‌స్టాగ్రాం ఖాతాను ఓపెన్ చేసి పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో మెసేజ్ చేసేవాడు. దానికి స్పందించి సంప్రదించిన యువతులతో కొద్ది రోజులు ఛాటింగ్ చేసేవాడు.
వారి న్యూడ్ ఫొటోలు, వీడియోలు సేకరించి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, బంధువులు, తల్లిదండ్రులకు పంపిస్తామని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నగరానికి చెందిన యువతికి నిందితుడు మెసేజ్ పంపించాడు. దానికి స్పందించిన యువతితో కొద్ది రోజులు ఛాటింగ్ చేశాడు. తర్వాత యువతితో న్యూడ్ కాల్ మాట్లాడి దానిని రికార్డు చేశాడు. దానిని యువతికి పంపించి బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. వీడియోను మీ తల్లిదండ్రులకు పంపిస్తానని చెప్పాడు. దీంతో బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ సైదులు, ఎస్సైలు ప్రసేన్ రెడ్డి, పిసిలు విజయ్‌కుమార్, నరేష్ తదితరులు పట్టుకున్నారు.