Monday, December 23, 2024

నకిలీ సర్టిఫికెట్ తో విదేశాలకు వెళ్లేందుకు యువకుడి యత్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నకిలీ సర్టిఫికేట్లతో విదేశాలకు వెళ్లేందుకు యత్నించిన యువకుడిని ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…కర్మాన్‌ఘాట్ ఎంఆర్‌ఆర్ కాలనీకి చెందిన పులిపాటి మణికంఠ (28) ఇంజినీరింగ్ చదువు మధ్యలో ఆపేశాడు. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లాలనే కోరికతో అమెరికాలో ఉండే స్నేహితుడు జనార్దన్ సూచన మేరకు డిగ్రీ పట్టా కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు.

మేఘాలయ రాష్ట్రానికి చెందిన ఓ వర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసినట్లు నరేశ్ అనే వ్యక్తి నుంచి రూ.1.60 లక్షలకు నకిలీ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా కొనుగోలు చేశాడు.ఈ సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్‌ఓటి పోలీసులు మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. నరేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్‌బి నగర్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News