Sunday, December 22, 2024

వృద్ధుడిలా మారువేషం..కెనడాకు ప్రయాణం

- Advertisement -
- Advertisement -

వృద్ధుడి వేషంలో కెనడాకు వెళ్లడానికి ప్రయత్నించిన ఒక యువకుడిని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. జుట్టుకు, గడ్డానికి తెల్ల రంగు వేసుకుని వృద్ధుడి వేషంలో కెనడా వెళ్లేందుకు ప్రయత్నించిన గురు సేవక్ సింగ్ అనే 24 ఏళ్ల యువకుడిని మంగళవారం రాత్రి విమానాశ్రయంలోని టెర్మినల్ 3 వద్ద సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది అడ్డుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించినట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. రష్వీందర్ సింగ్ సహోటా అనే 67 ఏళ్ల వ్యక్తి పోస్‌పోర్టును తనిఖీ చేస్తున్న సిఐఎస్‌ఎఫ్ సిబ్బందికి ఆ వ్యక్తి రూపురేఖలు అనుమానాస్పందంగా కనిపించాయి.

తెల్ల జుట్టు, తెల్ల గడ్డం, కళ్లజోడు ధరించి ఉన్న ఆ వృద్ధుడి ముఖం, చర్మ తీరు చూసిన సిబ్బంది లోతుగా ప్రశ్నించగా తన అసలు పేరు గురు సేవక్ సింగ్, తన వయసు 24 అని ఆ యువకుడు చెప్పాడు. అతని సెల్‌ఫోన్‌లో అతడి పేరిట ఉన్న పాస్‌పోర్టులో అసలు ఫోటోనే ఉంది. ఇది ఫోర్జరీ పాస్‌పోర్టు, మారువేషంలో విదేశీ ప్రయాణం కావడం వంటి నేరాలకు సంబంధించిన కేసు కావడంతో నిందితుడిని ఢిల్లీ పోలీసులకు సిఐఎస్‌ఎఫ్ అప్పగించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News