Wednesday, January 22, 2025

బ్లడ్ పేరుతో మోసం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బ్లడ్, ప్లాస్మా అవసరం ఉన్న వారి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న యువకుడిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…ఎపిలోని, విజయనగరం జిల్లాకు చెందిన రెడ్డి సందీప్ సోషల్ మీడియా వేదికగా మోసాలు చేస్తున్నాడు. పలువురు అర్జంట్‌గా బ్లడ్ కావాలని మెసేజ్‌లు పెడుతుంటారు. వాటిని చూసిన నిందితుడు వారికి ఫోన్ చేసి తన స్నేహితుడు బ్లడ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని చెప్పి, వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నాడు.

బాధితుడు ఆన్‌లైన్‌లో డబ్బులు పంపించిన తర్వాత స్పందించడం మానివేస్తున్నాడు. ఇలా చాలామందిని మోసం చేశాడు. గతంలో కూడా మోసం చేయడంతో పంజాగుట్ట, హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై విశాఖపట్టణం, బంజారాహిల్స్, రాంగోపాల్‌పేట్, ద్వారకా టౌన్, వైజాగ్ జిఆర్‌పి పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ బిక్షపతి, పిసిలు విజయ్‌రాజ్ యాదవ్, శ్రీనివాస్, రవీందర్, ప్రవీణ్‌కుమార్ పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News