Wednesday, January 8, 2025

వివాహం పేరుతో మోసం.. యువకుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః సెకండ్ మ్యారేజీ మహిళలను వివాహం చేసుకుంటానని నమ్మించి వారి బంగారు ఆభరణాలు దోచుకుంటున్న నిందితుడిని మార్కెట్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 27 తులాల బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్,చెక్‌బుక్, క్రెడిట్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఎసిపి రవీంద్రర్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం, నెడునూర్ గ్రామానికి చెందిన తుమ్మా మోహన్ రెడ్డి అలియాస్ శ్రీనాథ్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. నిందితుడు పలు నేరాలు చేయడంతో కల్వకుర్తి, కందుకూరు, మాదాపూర్, చైతన్యపురి, మియాపూర్, గుంటూరు దిశ పిఎస్, మార్కెట్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

బాధితురాలికి నిందితుడు భారత్‌మ్యాట్రిమోనీ.కామ్‌లో పరిచయం అయ్యాడు. మహిళకు వివాహం అయి విడాకులు తీసుకుంది. నిందితుడు తన అసలు పేరు చెప్పకుండా శ్రీనాథ్ పేరుతో పరిచయం పెంచుకున్నాడు. వివాహం చేసుకుంటానని సికింద్రాబాద్‌లోని హాటల్ యాత్రి ఇన్‌కు రావాలని చెప్పాడు. దీనిని నమ్మిని బాధితురాలు తన వద్ద ఉన్న 27తులాల బంగారు ఆభరణాలు బ్యాగులో పెట్టుకుని వచ్చింది. హోటల్ ఉన్న సమయంలో బాధితురాలు బాత్‌రూమ్‌కు వెళ్లగానే నిందితుడు ఆమెబ్యాగులో ఉన్న బంగారు ఆభరాణాలతో పరారయ్యాడు. బయటికి వచ్చిన బాధితురాలు విషయం గ్రహించి మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

డివోర్స్‌డ్ మహిళలే టార్గెట్…
నిందితుడు మోహన్ రెడ్డి 2011లో వివాహం చేసుకున్నాడు. తర్వాత విడాకులైన మహిళలను టార్గెట్‌గా చేసుకుని వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు చోరీ చేసి పరారవుతున్నాడు. నిందితుడు వివాహం అయిన తర్వాత కల్వకుర్తిలో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉదపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆ సమయంలో పదోతరగతి చదువుకుంటున్న బాలికను లైంగికంగా వేధించడంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరించారు. తన సోదరుడు మర్‌రెడ్డి కారు విక్రయించమని చెప్పడంతో దానిని రూ.4,50,000 విక్రయించి వచ్చిన డబ్బులతో జాల్సాలు చేసి మాదాపూర్‌లోని ప్రైవేట్ హాస్టల్‌లో చేరాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కందుకూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. హాస్టల్‌లో చేరిన తర్వాత తన రూమ్‌మేట్ వద్ద ఉన్న కంప్యూటర్, ల్యాప్‌టాప్, సోనీ స్పీకర్లు, వాచ్‌ను చోరీ చేసి వాటిని రూ.55,000కు విక్రయించాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లి దిల్‌సుక్‌నగర్‌లోని ప్రైవేట్ హాస్టల్‌లో చేరాడు.

అక్కడ రూమ్‌మేట్ వివో బుక్ 15 ల్యాప్‌టాప్ చోరీ చేశాడు. షాదీ.కామ్‌లో పరిచయమైన మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమె క్రెడిట్ కార్డు తీసుకుని రూ.2,20,000 విలువైన జోయలూకాస్‌లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేశాడు. తర్వాత విజయవాడకు వెళ్లి అక్కడి హాస్టల్‌లో చేరాడు. షాదీ.కామ్‌లో పరిచయమైన మహిళను గౌతం రెడ్డి పేరుతో పరిచయం పెంచుకున్నాడు. రెండు సార్లు హైదరాబాద్‌లో కలిశాడు. తర్వాత ఆమె క్రెడిట్ కార్డు తీసుకుని జోయాలుకాస్ జూవెల్లర్స్‌లో రూ.6,21,483 బంగారు ఆభరణాలు కోనుగోలు చేశాడు. తర్వాత ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. రెడ్డిమ్యాట్రీమోనిలో పరిచయమైన యువతికి తిరుమల విజయ్‌రెడ్డి పేరుతో సన్నిహితం పెంచుకున్నాడు. తర్వాత ఆమెకు ఫాల్స్ ప్రామిస్ చేసి రూ.9లక్షలు తీసుకుని ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసి బెంగళూరుకు పరారయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News