- Advertisement -
వివాహం చేసుకుంటానని మహిళకు చెప్పి శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేసిన యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్, మాదాపూర్‌కు చెందిన పిట్టు శ్రీనివాస్ రావు ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు. వెంకటగిరికి చెందిన మహిళ(ఎస్‌టి) నిందితుడికి పరిచయం అయింది. వివాహం చేసుకుంటానని మహిళకు చెప్పి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత తక్కువ కులం అని వివాహం చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని జూబ్లీహిల్స్ ఇన్స్‌స్పెక్టర్ వెంకటేవ్వర్ రెడ్డి తెలిపారు.
- Advertisement -