- Advertisement -
బాలికను వివాహం చేసుకున్న యువకుడిని ఫిలింనగర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం….ఫిలింనగర్‌కు చెందిన ఎస్టీ సమాజిక వర్గానికి చెందిన బాలిక(15)ను అదే కాలనీకి చనెందిన కళ్యాణ్ బాబు గత రెండేళ్ల నుంచి ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలోనే నవంబర్,2024లో బాలిక యువకుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. హైదరాబాద్, విశాఖపట్టణం, యాదాద్రి తదితర ప్రాంతాల్లో తిరిగారు. ఈ సమయంలోనే నిందితుడు వివాహం చేసుకుని శారీరకంగా కలిశాడు. బాలిక కుటుంబ సభ్యులు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తిరిగి ఇంటికి వచ్చింది. తర్వాత సంక్రాంతి పండగ సెలవుల్లో మళ్లీ కళ్యాణ్‌తో కలిసి వెళ్లింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
- Advertisement -