Tuesday, January 21, 2025

మహిళల ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్న యువకుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహిళలు, యువతుల ఫొటోలు మార్ఫింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న నిందితుడిని సిసిఎస్ హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్, హుస్సేనీఆలంకు చెందిన మనీష్ వర్మ ఇన్‌స్టాగ్రాంలో మహిళలు, యువతుల ప్రొఫైల్ ఫొటోలను డౌన్‌లోడ్ చేస్తున్నాడు. వాటిని నగ్నంగా మార్చి వాటిని సదరు మహిళలకు పంపిస్తున్నాడు. వెంటనే తనకు డబ్బులు ఇవ్వాలని లేకుండా వాటిని పోర్న్ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తామని బెదిరిస్తున్నారు. గత నెల 23వ తేదీన ఓ బాధితురాలు తన ఇన్‌స్టాగ్రాంలోని తన ఫొటోను డౌన్‌లోడ్ చేసుకుని దానిని మార్ఫింగ్

చేసి తన బంధువులకు పంపారని, బ్లాక్‌మేయిల్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే తనకు డబ్బులు ఇవ్వాలని లేకుండా వాటిని పోర్న్ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తామని బెదిరించాడు. బాధితురాలు వెంటనే సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిపై ఐపిసి 345(డి), 469,506,509 సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ పద్మ దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News