Friday, January 3, 2025

భార్య బిడ్డను పాముతో చంపేయించాడు

- Advertisement -
- Advertisement -

బరంపురం : ఒడిషాలో పాతికేళ్ల యువకుడు చావు తెలివితేటలు ప్రదర్శించాడు. భార్యను , రెండేళ్ల కూతురిని చంపేందుకు వారు నిద్రిస్తున్న గదిలోకి నాగు పామును పంపించి వారి ప్రాణాలు తీశాడు. ఒడిషాలోని గంజామ్ జిల్లాలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. నెలన్నర క్రితం అనుమానాస్పద రీతిలో తల్లి పాప చనిపొయ్యారు. వీరిని పాము కాటేసిందని భర్త కే గణేష్ పాత్ర అందరినీ నమ్మించేందుకు కట్టుకథలకు దిగాడు. కబిసూర్య నగర్ పోలీసు సేషన్ కిందికి వచ్చే అధెయిగన్ గ్రామంలో ఘటన చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు సమగ్రరీతిలో దర్యాప్తు జరిపారు. చివరికి నిజాలు వెలుగులోకి వచ్చాయి. భార్య బసంతి పాత్రతో గణేష్ పాత్రకు వైవాహిక వివాదాలు తలెత్తాయి.

2020లో వీరికి పెళ్లయింది. తనపై అనుమానం తలెత్తకుండా చేసుకునేందుకు పాత్ర పామును ప్రవేశపెట్టాడు. సమీపంలోని పాములుపట్టే వ్యక్తి వద్దకు వెళ్లి తాను పూజలు చేయాల్సి ఉందని పాము అవసరం ఉందని చెప్పి తీసుకువెళ్లినట్లు విచారణలో తేలింది. పామును తీసుకువెళ్లి దీనిని రూంలోకి విడిచిపెట్టాడు. తెల్లవారుజామున లోపల పాముకాటుతో ఇద్దరు చనిపోయి ఉన్నారు. యువకుడి వ్యవహారశైలిపై అనుమానం వచ్చి పోలీసులు విచారించగా ఇది హత్య అని నిర్థారణకు వచ్చారు. ఈ కేసులోతగు సాక్షాలు సేకరించుకుని నిందితుడిని అరెస్టు చేసేందుకు సమయం పట్టిందని గంజామ్ జిల్లా పోలీసు సూపరింటెంట్ జగ్మోహన్ మీనా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News