గంజాయి సరఫరా చేస్తున్న యువకుడిని ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్, నాంపల్లి ఎక్సైజ్ పిఎస్ సిబ్బంది గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 2కిలోల గంజాయి, కారు, బైక్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం…నగరానికి చెందిన యోగేష్ జాదవ్ ఓ వ్యక్తి వద్ద గంజాయి ఆర్డర్ ఇచ్చాడు. సదరు నిందితుడు గంజాయిని కారులో తీసుకుని వచ్చి నాంపల్లిలోని ఆదర్శకేఫ్ ప్రాంతంలో డెలివరీ చేసేందుకు వేచి ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది నిందితుల కోసం వేచి చూస్తున్నారను. ఈ క్రమంలోనే గంజాయి తీసుకుని వెళ్లేందుకు ధూల్‌పేటకు చెందిన యోగేష్ జాదవ్ బైక్‌పై
అక్కడికి వచ్చి గంజాయి ప్యాకెట్‌ను తీసుకుని వెళ్లేందుకు యత్నిస్తుండగా ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నారు. మిగతా వారు ఎక్సైజ్ సిబ్బందిని చూసి అక్కడి నుంచి పారిపోయారు. గంజాయి కేసుతో సంబంధం ఉన్న మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. గంజాయిని తీసుక వెళ్లడానికి వచ్చిన యోగేష్ జాదవ్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో కే.సతీష్, ఎస్.రజిత, అమ్మకందార్లు ఎం.ప్రశాంత్, సాకేత్ రాహుల్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌టిఎఫ్ టీమ్ లీడర్ అంజి రెడ్డి తెలిపారు. గంజాయిని పట్టుకున్న టీంలో సీఐలు ఎంపిఆర్ చంద్రశేఖర్, సుధాకర్ వర్మ, ఎస్సై సాయికిరణ్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు భాస్కర్‌రెడ్డి, అజీమ్, సుధీర్ కానిస్టేబుళ్లు ప్రకాష్, రాకేష్,మహేష్ ఉన్నారు.