Monday, December 23, 2024

దేవుళ్ల అశ్లీల చిత్రాల అమ్మకాలు ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : హిందూ దేవుళ్లు, దేవతల అశ్లీల చిత్రాలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న ఓ పోకిరి యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. 21 సంవత్సరాల ఆదర్శ్ సైనీ తనకు పడని ఓ వ్యక్తిపై కక్ష తీర్చుకునేందుకు ఆన్‌లైన్ మార్గం ఎంచుకున్నాడు. ఈ వ్యక్తికి చెందిన వెబ్‌సైట్‌ను పోలిన వైబ్‌సైట్‌ను రూపొందించుకుని దీని ద్వారా అశ్లీల చిత్రాలు విక్రయిస్తున్నట్లు, పైగా తాను ఎంచుకున్న వ్యక్తి అశ్లీల చిత్రాలు అమ్ముతున్నట్లు పలు సార్లు ఫిర్యాదులకు కూడాదిగినట్లు డిసిపి హేమంత్ తివారీ చెప్పారు.

ముందుగా మహిళా కమిషన్ నుంచి తమకు అశ్లీల చిత్రాల అమ్మకాల గురించి ఫిర్యాదు అందిందని, దీనితో బీహార్‌లోని దర్భంగకు చెందిన రాహుల్ కుమార్‌ను విచారించగా ఆయన తప్పిదేమిమి లేదని తేలిందని వివరించారు. తరువాత విచారణ క్రమంలో ఈ తప్పుడు పనికి దిగుతున్నది హరిద్వార్‌కు చెందిన ఆదర్శ్ సైనీగా గుర్తించినట్లు పోలీసు అధికారి తెలిపారు. రాహుల్‌పై కక్ష తీర్చుకునేందుకు తాను ఈ పనిచేసినట్లు నిందితుడు చెప్పారు. తప్పుడు కేసులలో ఇరికించి రాహుల్‌ను ముప్పు తిప్పలు పెట్టాలని చూసినట్లు వెల్లడించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News