Monday, December 23, 2024

మొబైల్స్ చోరీ చేస్తున్న ఇద్దరు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః మొబైల్ ఫోన్లు చోరీ చేస్తున్న ఇద్దరు యువకులను బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. తొమ్మిది మొబైల్ ఫోన్లు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట ఎసిపి రామలింగరాజు పిఎస్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బోయినపల్లికి చెందిన బొబ్బిటి అనిల్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు, భండారి కృష్ణ కూలీ పని చేస్తున్నాడు. ఇద్దరు కలిసి మొబైల్ ఫోన్లను చోరీ చేస్తున్నారు.

ఈ నెల 19వ తేదీన బేగంపేట పోలీసులు బాలంరాయ్ కమాన్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఇద్దరు యువకులు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారు. వెంటనే గమనించిన పోలీసులు వారిని పట్టుకుని విచారించారు. విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు మరింత గట్టిగా విచారణ చేశారు. దీంతో మొబైల్ ఫోన్ల స్నాచింగ్ విషయం బయటపడింది. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారు కొట్టేసిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై నాగరాజు, పిసిలు పూర్ణచందర్, మహేష్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News