Sunday, December 22, 2024

గంజాయి రవాణా చేస్తున్న యువకుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

గంజాయి రవాణా చేస్తున్న యువకుడిని ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 31.2కిలోల గంజాయి, కారు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…ఎపిలోని కృష్ణా జిల్లా, విజయవాడకు చెందిన బోయినిపల్లి సురేష్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న నిందితుడు గతంలో కూడా గంజాయి రవాణా చేస్తు పలుమార్లు పట్టుబడ్డాడు. ఇటీవలి కాలంలో ఖమ్మంకు చెందిన పలువురు గంజాయి విక్రయదారులతో పరిచయం పెంచుకున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. కారులో గంజాయి కొనుగోలు చేసి నిజామాబాద్‌కు తీసుకుని వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిదితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు కోసం నాగోల్ పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News