Tuesday, December 3, 2024

యువతిపై ప్రేమోన్మాది దాడి….

- Advertisement -
- Advertisement -

Young man attack on women in Jagtial

జగిత్యాల: ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేసిన అనంతరం అతడు పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లా జాబితాపూర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మేడిపల్లి మండలం మన్నెగూడానికి చెందిన రాజ్ కుమార్ (25) అనే యువకుడు గల్ఫ్ నుంచి నాలుగు నెలల క్రితం భారత్ కు వచ్చాడు. తన గ్రామంలో ఉంటూ జాబితాపూర్ గ్రామానికి చెందిన యువతిని వేధిస్తున్నాడు. ప్రేమిస్తున్నంటూ వెంటపడడంతో యువతి పట్టించుకోలేదు. యువతి ఫోన్ నంబర్ కు పలుమార్లు యువకుడు ఫోన్ చేసినప్పటికి ఆమె పట్టించుకోలేదు. ఆమె ఇంటికెళ్లి యువతిపై కత్తితో మెడ భాగంలో కోశాడు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో అతడు కత్తితో పొడుచుకున్నాడు. వెంటనే గ్రామస్థులు అతడిని 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News