Wednesday, January 22, 2025

మహిళలను వేధిస్తున్న యువకుడికి దేహశుద్ధి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మహిళలను వేధిస్తున్న ఓ యువకుడిని దేహశుద్ధి చేసిన సంఘటన మంగళవారం కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధిలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసులు,స్థానికులు తెలిపిన కథనం ప్రకారం..సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ డయాగ్నొస్టిక్ సెంటర్ లో పనిచేసే సికిందర్ అనే యువకుడు గంజాయికి బానిసై డయాగ్నొస్టిక్ సెంటర్ కి వచ్చే యువతుల,మహిళల ఫోన్ నంబర్లు తీసుకొని వారిని వేధించడం మొదలు పెట్టాడు.

మహిళలకు వాట్సాప్ ద్వారా అశ్లీల వీడియోలు పంపించి వేధించేవాడని బాధిత మహిళలు బంధువులకు తెలిపారు. దీంతో మహిళ బంధువులు యువకిడిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన యువకుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News