Thursday, January 23, 2025

దారి కాసి అడ్డగించి హత్య..

- Advertisement -
- Advertisement -

భీమిని : దారి కాచి కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన భీమిని మండలంలోని కేస్లాపూర్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కేస్లాపూర్ గ్రామానికి చెందిన బొడ్డు జలందర్ శారద దంపతులు హైదరాబాద్ నివాసం ఉంటూ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సొంత గ్రామంలో ఓటు వేసేందుకు బుధవారం స్వగ్రామానికి కుటుంబు సమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో పోలింగ్ కేంద్రం వద్ద కేస్లాపూర్ గ్రామానికి చెందిన ముత్యం రాజశేఖర్ గౌడ్, జలందర్‌ మధ్య వివాదం చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం సమయంలో భీమిని మండల కేంద్రంలో పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి వస్తున్నాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో కేస్లాపూర్ గ్రామానికి కూతవేటు దూరంలోని హనుమాన్ ఆలయం వద్ద కాపు కాసిన రాజశేఖర్ గౌడ్ ద్విచక్ర వాహనంపై వస్తున్న జలందర్ అడ్డుకొని కత్తితో పొడిచి పారిపోయాడు.

రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న జలందర్‌ను గుర్తించిన ఇతర వాహనదారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబీకులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుని పోలీసు వాహనంలో బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు. అతని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. విషయం తెలుసుకున్న బెల్లంపల్లి ఏసీపీ సదయ్య, తాండూర్ సర్కిల్ సీఐ శ్రీనివాస్‌రావు, భీమిని ఎస్సై ప్రశాంత్‌లు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. హత్య చేసిన రాజశేఖర్ భీమిని పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఒకే గ్రామం కావడంతో గొడవలు అయ్యే అవకాశం ఉందని పోలీసులు ముందస్తు చర్య తీసుకున్నారు. పోలింగ్ బూత్ వద్ద గురువారం జరిగిన గొడవ కాకుండా గతంలో వీరి మద్య విభేదాలు ఉన్న నేపథ్యంలో హత్య చేసినట్లు పలు వాదనలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News