Saturday, December 28, 2024

మందమర్రిలో యువకుని దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

కాసిపేటః కాసిపేట మండలం మామిడిగూడ గ్రామ పంచాయితీ పరిధిలోని మామిడిగూడెం గ్రామానికి చెందిన లావుడియా సాగర్(21) మందమర్రిలో దారుణ హత్యకు గురయ్యాడు. సాగర్ ను కొందరు వ్యక్తులు తీవ్రంగా కొట్టి అదే వ్యక్తులు సాగర్‌ను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసి వెళ్లినట్లు సమాచారం. సాగర్ అప్పటికే మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వివరాలలోకి వెళితే.. మామిడిగూడెంకు చెందిన సాగర్ మందమర్రి దీపక్‌నగర్ ప్రాంతంలో గల వాటర్ ప్లాంట్‌లో పని చేసి ఇటీవల లారీపై క్లీనర్‌గా వెళుతున్నట్లు మృతుని తండ్రి తారాచంద్ తెలిపారు. శుక్రవారం రాత్రి లారీపై పనులు ముగించుకొని రాత్రి 8 గంటలకు సాగర్ మామిడిగూడెంలోని ఇంటికి వచ్చినట్లు ఆయన తెలిపారు. అదె సమయంలో సాగర్‌కు ఫోన్ రావడంతో తన కొడుకు తనతో తన లారీ ఓనర్ డబ్బులు ఇస్తానని చెప్పినాడని వెళ్లి డబ్బులు తీసుకొని వస్తానని రాత్రి పల్సర్ బండిపై మందమర్రికి వెళ్లడం జరిగిందని ఆయన తెలిపారు.

Also Read: ఆర్టీసిలో పదేళ్లుగా లేని నియామకాలు..

సాగర్ రాక పోవడంతో తాను ఫోన్ చేయగా ఫోన్ స్విఛ్చాప్ వచ్చిందని ఆయన తెలిపారు. శనివారం ఉదయం 9 గంటలకు పోలీసులు తనకు అల్లుడు వరుస అయిన హాట్‌కర్ శ్రీకాంత్‌కు ఫోన్ చేసి సాగర్ చనిపోయాడని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాడని తెలియడంతో తమకు తెలిసిందని ఆయన తెలిపారు.  తాము ఆసుపత్రికి వెళ్లడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో తన కుమారుడు చనిపోయి ఉన్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. తన కొడుకును లారీ ఓనర్ గిరిబాబు, వాటర్ ప్లాంట్ ఓనర్ చిట్టి, బొడ్డు బాలాజీ, నూనె వెంకటేష్, బోగి వెంకటేష్, అల్లంకుంట గణేష్ లు కొట్టి చంపారని ఆయన మందమర్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తారాచంద్ తెలిపారు. సాగర్ హత్యకు సంబందించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. గతంలో ఒక యువతి విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం. తారాచంద్ ఫిర్యాదు మేరకు మందమర్రి ఎస్‌ఐ చంద్రకుమార్ కేసు నమోదు చేయగా, సిఐ మహేందర్‌రెడ్డి ధర్యాప్తు చేపట్టారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News