Sunday, December 22, 2024

సెల్‌ఫోన్ దొంగలను అడ్డుకున్న యువకుడు..కత్తితో బెదిరించిన వెనక్కి తగ్గలేదు

- Advertisement -
- Advertisement -

బైక్‌పై వచ్చి సెల్‌ఫోన్ తీసుకొని పారిపోయేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను ఓ యువకుడు ధైర్య సాహసాలతో పట్టుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం… హైదరాబాద్‌లోని వెంగళరావునగర్ పరిధిలోని లక్కీ హాస్టల్‌లో ఉంటున్న పి. జాషువా కుమార్ ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో హాస్టల్ బయట కూర్చున్నాడు. నంబర్ ప్లేట్ లేని ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు ఆగంతకులు అడ్రస్ అడుగడంతో వారి వద్దకు జాషువా వచ్చాడు. సెల్ ఫోన్ ఇస్తే ఫోన్ చేసుకుని ఇస్తామని అడగడంతో ఇచ్చాడు. వారికి సెల్ ఫోన్ ఇచ్చిన వెంటనే ఇద్దరు నిందితులు పారిపోయేందుకు యత్నించారు.

అప్రమత్తమైన జాషువా వారి బైక్ కీని లాక్కున్నాడు. ఆగంతకులు అతడిని కత్తి తీసి బెదిరించి, దాడి చేయడానికి యత్నించారు. అయినా జాషువా కుమార్ భయపడకుండా ఒక స్నాచర్లు పట్టుకోగా కత్తితో దాడి చేశాడు. ఈక్రమంలో బాధితుడు గట్టిగా అరవడంతో హాస్టల్ నుంచి బయటికి వచ్చిన యువకులు ఆగంతకులను పట్టుకుని 100కు డయల్ చేశారు. మధురానగర్ పోలీసులు వచ్చి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News