Wednesday, January 8, 2025

లోన్ యాప్ వల్ల మోసపోయిన యువకుడు

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: లోన్ యాప్ వల్ల మోసపోయిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కామారెడ్డి చెందిన సందీప్ వివిధ లోన్ యాప్ ల నుంచి రూ.12 లక్షలు లోన్ తీసుకున్నాడు. సందీప్ తీసుకున్న లోన్ తిరిగి చెల్లించకపోవడంతో లోన్ యాప్ నుంచి సందీప్ , కుటుంబ సభ్యులకు అసభ్యకర మెస్సెజ్ లు వచ్చాయి.

Also Read: సికింద్రాబాద్ లో నాలాలో పడి చిన్నారి మృతి

హత్యకు యత్నించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు సందీప్ ను కాపాడారు. బెట్టింగ్ యాప్ లో పలు దఫాలుగా రూ.12 లక్షలు సందీప్ పోగొట్టుకున్నాడు. దీంతో మోసపోయానని గ్రహించిన సందీప్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News