Wednesday, January 22, 2025

కబడ్డీ ఆడుతూ కుప్పకూలిన యువకుడు

- Advertisement -
- Advertisement -

 

నాగర్ కర్నూల్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన కబడ్డీ పోటీలలో విషాదం నెలకొంది. కబడ్డీ ఆడుతూ గన్యాకుల గ్రామానికి చెందిన మహేష్ (21)అనే యువకుడు మృతి చెందాడు. నాగర్ కర్నూల్ జిల్లా గన్యాగుల గ్రామంలో సోమవారం సంక్రాంతి సందర్భంగా కనుమ రోజు గ్రామంలో కబడ్డీ పోటీలను నిర్వహించగా పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.

కాగా గ్రామానికి చెందిన మహేష్(21) అనే యువకుడు కబడ్డీ ఆడుతూనే కుప్ప కూలాడు. వెంటనే గ్రామస్తులు నాగర్ కర్నూల్ లోని జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువకుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మహేష్ మృతి పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News