Tuesday, December 24, 2024

మోసం… యువకుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Young man commit suicide in Peddapalli

పెద్దపల్లి: ఆరు లక్షల రూపాయలు తీసుకొని ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇప్పించకపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దపల్లి జిల్లా కమాన్పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆర్‌ఎఫ్‌సిఎల్ కంపెనీలో ముంజ హరీష్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఉద్యోగం పర్మినెంట్ చేస్తానని  చెప్పి హరీష్ వద్ద నుంచి ఓ బ్రోకర్ రూ 6.7 లక్షల తీసుకున్నాడు. ఎంతకు ఉద్యోగం పర్మినెంట్ కాకపోవడంతో హరీష్ మనస్థాపం చెందాడు. మోసపోయానని గ్రహించి కమాన్పూర్ మండల కేంద్రంలోని ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. సదరు కంపెనీలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 780 మంది వద్ద డబ్బులు తీసుకున్నారని, అందరికీ న్యాయం చేయాలని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News