అంబర్ పేట: పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న భార్య వదిలి పెట్టి వెళ్లిపోయిందని భర్త తీవ్ర మనస్థాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్టేషన్ అడ్మిన్ ఎస్‌ఐ మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం… 2014లో తమ గ్రామంలో భవాని అనే అమ్మాయితో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. 2019లో భార్య భర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో భారీ అతని వదిలివేసి తల్లిగారింటికి వెళ్లిపోయింది. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఏం .మహేందర్ ఒంటరిగా అంబర్ పేట న్యూ పటేల్ నగర్ లో నివాసం ఉంటూ సెంట్రింగ్ పని చేస్తూ ఒంటరిగా జీవించడం మొదలుపెట్టాడు.
తన భార్య వదిలిపెట్టిందని బెంగతో మద్యానికి బానిస అయ్యాడు. దీనితో ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండేవాడు సోమవారం ఉదయము ఊర్లో ఉండే తన తల్లికి ఫోన్ చేసి నాకు బతకాలని లేదు చనిపోతానని చెప్పాడు. తల్లి వెంటనే ఇంటి ఓనర్ అయినా బాలరాజ్ కి ఫోన్ చేసి నా కొడుకు ఇలా మాట్లాడుతున్నాడని కొద్దిగా చూడమని చెప్పగా హడావుడిన ఓనరు కిటికీలో నుంచి చూడగా అప్పటికే అతను ఉరివేసుకొని మృతి చెంది ఉన్నాడు. మహేందర్ సోదరుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నమని పోలీసులు తెలిపారు.