Sunday, December 22, 2024

స్నేహితుడి మృతి తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Young man committed suicide in Nizamabad

మెండోరా: స్నేహితుడి మృతి తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన నిజామాబాద్ జిల్లాలోని మెండోరా మండలం పోచంపాడులో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం… జనవరి 13న కరోనా వైరస్ బారినపడి శ్రీను మృతిచెందాడు. మిత్రుడు చనిపోయాడనే మనస్తాపంతో మృతుడు రవి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. శ్రీని సమాధి పక్కనే ఖననం చేయాలని రవి తాను చనిపోయే ముందు లేఖలో పేర్కొన్నాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసుల కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటన గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News