Monday, December 23, 2024

బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

బైక్ కొనివ్వలేదని యువకుడు ఉరి వేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎలుకబావి వాడలో చోటు చేసుకుంది. శశికుమార్ అనే యువకుడు తనకు బైక్ కొనివ్వాలని తల్లిపై కొన్ని రోజులుగా ఒత్తిడి తెస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో సాధ్యం కాదని తల్లి కుమారునికి నచ్చజెబుతు వస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన శశికుమార్ తన ఇంట్లో శనివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తల్లి వసంత భర్త కొన్నేళ్ల క్రితం మృతిచెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జగిత్యాల పట్టణ సీఐ కిశోర్ తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News