సిద్దిపేట: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లిలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… డిగ్రీ విద్యార్థి గణేశ్ (18) తన తండ్రికి సహాయంగా వ్యవసాయ పనులకు వెళ్లాడు. పొలం దగ్గర పనులు చేస్తుండగా కరెంటు తీగలు గణేశ్‌కు తగలడంతో ఘటనా స్థలంలోనే అతడు చనిపోయాడు. కరెంటు తీగలు కిందికి ఉన్నాయని విద్యుత్ అధికారులకు మొర పెట్టుకున్న పట్టించుకోలేదని గణేశ్ తండ్రి శ్యాంనాథ్ వాపోయాడు. విద్యుత్ తీగలను సరిచేయాలని ఆ శాఖ అధికారులు విన్నవించిన పట్టించుకోలేదని గ్రామస్థులు కూడా ఆరోపణలు చేశారు. దీంతో గణేశ్ మృతదేహంలో రోడ్డుపై గ్రామస్థులు ధర్నాకు దిగారు. టిఆర్‌ఎస్ నేత స్థానిక ఎంపి ప్రభాకర్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లగా లక్ష రూపాయలతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని ప్రకటించాడు. విద్యుత్ శాఖ వాళ్లు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించడంతో ధర్నా విరమించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ మహబూబ్ తెలిపారు.