Sunday, December 22, 2024

పెళ్లి చేసుకోవడానికి అన్నవరం వెళ్తుండగా ప్రమాదం.. ప్రియుడు మృతి

- Advertisement -
- Advertisement -

Young man death in road accident at Kakinada

అమరావతి: కాకినాడ జిల్లా పిఠాపురం దగ్గర శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి అదుపు తప్పిన బైక్ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువతీయువకుడికి గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా యువకుడు మార్గంమధ్యలో ప్రాణాలు విడిచాడు. తీవ్రగాయాలతో యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మృతుడు గణేష్, దీప్తిల మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని, పెళ్లి చేసుకోవడానికి అన్నవరం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు వెల్లడించారు. యువతి బంధువులే యాక్సిడెంట్ చేయించారని మృతుడు గణేష్ తల్లి ఆరోపిస్తోంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News