Wednesday, January 22, 2025

లారీ ఢీ కొని యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

ఫరూఖ్‌నగర్ :లారీ ఢీ కొని ఓ గర్తు తెలియని యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం ఉదయం మండల పరిధిలోని రాయికల్ టోల్ గేట్ సమీపంలో వెలుగుచూసింది. పట్టణ సీఐ ప్రతాప్‌లింగం తెలిపిన వివరాల ప్రకారం … గత నెల 30 న టోల్ ప్లాజా సమీసంలో ఏపీ37టిఎఫ్3685 నంబర్ గల లారీ గుర్తు తెలియని యువకుడిని ఢీ కొట్టడంతో తలకు బలయమైన గాయంతో అక్కడికక్కడే చనిపోయాడన్నారు.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న తమ సిబ్బంది ఘటన స్థలాకి చేరుకున్నారని ప్రమాద వివరాలను సేకరించినట్లు తెలిపారు. డైవర్ నిర్లక్షం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని, మృతుని వయస్సు సుమారుగా 25 నుండి 30సంవత్సరాలు ఉంటాయని, మృత దేహాన్ని షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచినట్లు తెలిపారు. మృతుని వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News