- Advertisement -
హైదరాబాద్: లారీ ఢీకొట్టడంతో యువకుడు మృతిచెందిన సంఘటన నగరంలోని ఎర్రగడ్డ మెట్రోస్టేషన్ కింద బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…యూసుఫ్‌గూడలోని వినాయకనగర్‌కు చెందిన నితిన్ బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అంబులెన్స్‌లో కుటుంబ సభ్యులు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించి తమ కుమారుడిని ఆస్పత్రికి తరలిస్తే బతికేవాడని తెలిపారు. పోలీసులు ఆలస్యం చేయడం వల్లే మృతిచెందాడని ఆరోపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. యువకుడి మృతికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -