Sunday, January 12, 2025

నూర్పిడి యంత్రంలో పడి యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

తానూర్ : ముథోల్ మండలంలోని విఠోలి గ్రామంలో శనగలు నూర్పిడి చేస్తుండగా ప్రమాదవశాత్తు యంత్రంలో పడి మధ్యప్రదేశ్ కు చెందిన యువకుడి మృతి చెందిన ఘటన మరిచిపోక ముందే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని ఖర్బాల గ్రామంలో ఆదివారం రాత్రి ఇదే తరహాలో విషాద ఘటన జరిగింది.మధ్యప్రదేశ్ కి చెందిన మరో యువకుడు దుర్మరణం పాలయ్యాడు.వివరాలలోకి వెళితే..స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. ఖర్బాల గ్రామానికి చెందిన రైతు శనగలను నూర్పిడి చేస్తుండగా సంబంధిత యంత్రంపై పని చేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన దినేష్ (26) ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు.

గత కొంత కాలంగా ఉపాధి కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దినేష్  ఇక్కడి ప్రాంతానికి వచ్చి నూర్పిడి యంత్రంపై పని చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆదివారం ఖర్బాలలో శనగలను నూర్పిడి చేస్తుండగా యంత్రంలో పడి చుట్టుకు పోయాడు. దీంతో అతని శరీరం, తల మొండెం వేర్వేరుగా విడిపోయాయి. ఉపాధి కోసం వచ్చిన ఆయనను నూర్పిడి యంత్రం ఊసురు తీసింది. రాత్రి వేళలో మృతదేహానికి సంబందించిన తల, మొండెం భాగాలను పోస్టుమార్టం నిమిత్తం తానూర్ పోలీసులు భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News