Monday, April 7, 2025

సబితం వాటర్ ఫాల్స్‌లో పడి యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

పెద్దపెల్లి : ప్రమాదవశాత్తు వాటర్ ఫాల్స్ లో పడి యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన పెద్దపెల్లి జిల్లా సబితం వాటర్ ఫాల్స్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. కరీంనగర్ లోని కిసాన్ నగర్ కు చెందిన మానుపాటి వెంకటేష్ స్నేహితులతో కలిసి వాటర్ ఫాల్స్ సందర్శనకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. యువకుడు ఫాల్స్ లో పడిపోయాడని సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

అందుకున్న వాటర్ ఫాల్స్ వద్ద నీటి ప్రవాహం అధికంగా ఉందని ఎవరు సందర్శనకు రావద్దని ఎన్ని మార్లు విన్నవించిన ప్రజలు పట్టించుకోవడం లేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. యువకుడి మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News