Friday, December 27, 2024

ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

మొగుడంపల్లి: పొలానికి నడుచుకుంటూ వెళ్తూ ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి ఓ యువకుడు మృతి సంఘటన గొడియర్‌పల్లి గ్రామంలో ఆదివారంచోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి చిరాగ్‌పల్లి ఎస్‌ఐ నరేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గొడియర్‌పల్లి గ్రామానికి చెందిన నెళ్వాల్ అభిషేక్ (18) అనే యువకుడు తన వ్యవసాయ పొలానికి కాలి నడకన వెళ్తుండగా మద్రి నారాయణ వ్యవసాయ పొలం పక్కనే ఉన్న ‘నామన్ బావి’లో ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డాడు. అయితే అభిషేక్‌కు ఈత రాకపోవడంతో అందులోనే మునిగి మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుని తండ్రి నెళ్వాల్ కాశీనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News