Thursday, January 23, 2025

భార్యాభర్తల దాడితో రైలు ప్రమాదానికి బలైన యువకుడు

- Advertisement -
- Advertisement -

ముంబై : ముంబై రైల్వే స్టేషన్‌లో భార్యాభర్తలతో ఘర్షణ పడిన 26 ఏళ్ల యువకుడు అదుపు తప్పి రైలు కింద పడడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి 9. 15 గంటలకు జరిగింది. మొదట ప్రమాదంగా రైల్వే పోలీస్‌లు కేసు నమోదు చేసినప్పటికీ సిసిటివి ఫుటేజీ దృశ్యాల్లో వాస్తవ సంఘటన బయటపడడంతో నిందితులైన భార్యాభర్తలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్‌లో పనిచేస్తున్న 26 ఏళ్ల దినేశ్ రాథోర్.

ముంబై సియోన్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారంపై ఆదివారం రాత్రి దినేశ్ అనుకోకుండా అక్కడ ఉన్న శీతల్ మేని అనే 30 ఏళ్ల మహిళను ఢీకొన్నాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం తీవ్రమైంది. శీతల్ మేని కోపగించుకుని తన వద్దనున్న గొడుగుతో దినేశ్‌ను కొట్టడం ప్రారంభించింది. మధ్యలో ఆమె భర్త అవినాశ్ జోక్యం చేసుకుని దాడి చేయగా దినేశ్ అదుపు తప్పి రైలు పట్టాలపై జారి పడ్డాడు. అదే సమయంలో అక్కడికొచ్చిన లోకల్ ట్రైన్ దినేశ్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీస్‌లు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News