Monday, December 23, 2024

ఈతకు వెళ్లి యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన శివరాత్రి ప్రభాకర్ హైదరాబాదులో కూలి పని చేస్తూ జీవనం సాగించేవాడు. రెండు రోజుల క్రితం గ్రామానికి కుటుంబం సమేతంగా వచ్చారు. శనివారం ఉదయం అతని రెండవ కుమారుడైన శివరాత్రి నరేష్ (20)స్నేహితులతో కలిసి ఈతకు వెళ్ళాడు.

అక్కడ ఈత రాకపోవడంతో బావిలో మునిగి చనిపోయాడు. ఇట్టి విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీస్ వారికి సమాచారం అందించడంతో గ్రామస్తులు, పోలీసులు అగ్నిమాపక విభాగం సహాయం చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేందర్ గౌడ్ తెలిపారు. సంఘటన స్థలానికి సిఐ సురేందర్ రెడ్డి కూడా హాజరయ్యారు. నరేష్ మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News