Wednesday, January 22, 2025

ద్విచక్ర వాహనంపై నియంత్రణ కోల్పోయి యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

 

ద్విచక్ర వాహనంపై నియంత్రణ కోల్పోయి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన ఎల్. కోట మండలంలో చోటుచేసుకుంది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన విఘ్నేష్ (22), సాత్విక్, శివ, సందీప్ నూతన సంవత్సరం సందర్భంగా అరకును చూడటానికి విశాఖకు వెళ్ళారు. అక్కడి నుంచి డిసెంబర్ 31న రైలులో అరకు చేరుకున్నారు. విఘ్నేష్, సాత్విక్ ఆదివారం విశాఖకు తిరిగి వచ్చారు. విశాఖ అరకు రహదారిపై వెళ్లాలని రాత్రి 8 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఎల్.కోట పంచాయతీ పరిధిలోని సోంపురం కూడలి వద్ద రోడ్డుపై గుంతల కారణంగా వారి వాహనం అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో విఘ్నేష్ తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స కోసం విజయనగరం తరలించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో యువకుడు మరణించాడు. సాత్విక్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు సోమవారం సాయంత్రం ఎల్.కోట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఆ సమయంలో ప్రయాణం వద్దని చెప్పిన వినలేదని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వి.సత్యం తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News