- Advertisement -
గన్‌తో కాల్చుకుని రంగారెడ్డి జిల్లా, కేశంపేట మండల కేంద్రానికి చెందిన యువకుడు గంప ప్రవీణ్ (27) అమెరికాలో మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ప్రవీణ్ అమెరికాలో ఎంఎస్ రెండవ సంవత్సరం చదువుతూ పార్ట్‌టైమ్‌ంగా ఒక స్టోర్‌లో జాబ్ చేస్తున్నాడు. మిల్వాంకివిస్కాన్సిన్ సిటీలో నివాసం ఉంటున్న ప్రవీణ్ నివాసం ఉండే ఇంటికి దగ్గరలోని బీచ్ వద్ద గన్‌తో కాల్చుకుని బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ విషాధ ఘటనతో ప్రవీణ్ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహం స్వదేశానికి వచ్చేందుకు కొంత సమయం పడుతుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -