Friday, December 27, 2024

పియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడిని చంపిన కుటుంబ సభ్యులు

- Advertisement -
- Advertisement -

ఘట్‌కేసర్ : ఇంట్లో ఎవరు లేని సమయంలో ప్రియురాలు ఇంటికి వెళ్ళిన ప్రియుడిని ఆమె కుటుంబ సభ్యులు అతి ధారుణంగా దాడి చేయగా తీవ్రగాయాలతో మృతి చెందిన సంఘటన పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడ లక్ష్మీనర్సింహ కాలనీలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గజ్వేల్‌కు చెందిన దారావత్ సుశీల తన కుమారుడి దారావత్ కరణ్ నాయక్ ( 18 ) తో కలసి అన్నోజిగూడ లక్ష్మీనర్సింహా కాలనీలో గత 15 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. కరణ్ తన ఇంటి సంమీపంలో ఉంటున్న ఓ బాలిక (15)ను ప్రేమించినట్లు స్థానికులు వాపోయారు.

బుధవారం సాయంత్రం ఇంటిలో ఎవరు లేని సమయంలో ప్రియురాలి ఇంటి వద్దకు చేరుకున్న కరణ్‌ను ఆమె కుటుంబ సభ్యులు దాదాపు పదిహేన్ మంది పట్టుకొని విచక్షణ రహితంగా మర్మాంగాలపై కారం చల్లుతూ దాడి చేసినట్లు పేర్కొన్నారు. తదనంతరం బాలిక జోలికి వస్తే వదిలేది లేదని హెచ్చరించి వదలడంతో ఇంటికి చేరుకున్న కరణ్ కింద పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, ఈ మేరకు ప్రియురాలు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News