Monday, December 23, 2024

పరువు పోతుందని యవకుడు బలవన్మరణం

- Advertisement -
- Advertisement -

 

పరువు పోతుందని బాధతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలం పగిడాల చెందిన బాలరాజు(26) తల్లితో పాటు మహబూబ్నగర్ పట్టణంలోని ఉంటున్నారు. బాలరాజు డిగ్రీ వరకు చదువుకున్నాడు. స్నేహితులు ఇతరులకు మధ్యవర్తి ద్వారా డబ్బులు వడ్డీ పై ఇప్పించేవాడు. డబ్బులు ఇవ్వాలని అప్పు ఇచ్చిన వారు బాలరాజును కోరారు.

అతను వేరే వారి నుంచి రావాలని వచ్చిన తర్వాత ఇస్తానని చెబుతూ వచ్చాడు. సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడంతో విక్రాంత్ అనే వ్యక్తి బాలరాజును కొట్టి ఆయన ద్విచక్ర వాహనాన్ని తీసుకెళ్లాడు. పరువు పోతుందని బాధపడిన బాలరాజు సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని చనిపోయాడు. చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాసాడు.

ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఒకరి నుంచి తెచ్చి మరొకరికి ఇచ్చానని సొంతానికి డబ్బులు వాడుకోలేదన్న మరణ వాంగ్మూలం పత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విక్రాంత్ డబ్బుల కోసం బలవంతం చేయడమే కాకుండా కొట్టడంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని బాలరాజ్ తల్లి వెంకటమ్మ మహబూబ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News