Wednesday, January 22, 2025

రేపే పెళ్లి… కరెంట్ షాక్‌తో పెళ్లి కొడుకు మృతి

- Advertisement -
- Advertisement -

కొమ్ముగూడెం: మహబూబాబాద్ జిల్లాలోని కొమ్ముగూడెంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. రేపు పెళ్లి జరుగనుండగా ఈ రోజు కరెంట్ షాక్ తో యువకుడు మృత్యువాత పడ్డాడు. బోరు మోటరు రిపేరు చేస్తుండగా కరెంట్ షాక్ తో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని యాకూబ్ గా గుర్తించారు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News