Monday, January 27, 2025

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కారు డ్రైవర్ నిర్లక్షంగా వాహనం నడపడంతో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…వరంగల్ జిల్లా, కాజీపేటకు చెందిన రోహిత్ రెడ్డి(31) గచ్చిబౌలిలోని లుంబినీ కన్‌స్ట్రక్చన్స్‌లో సేఫ్టీ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. గచ్చిబౌలిలోని టిఎన్‌జిఓస్ కాలనీలో ఉంటున్నాడు. తెల్లవారుజామున 1.45 గంటలకు హోండా యాక్టివా బైక్‌పై వెళ్తుండగా ఐఎస్‌బి స్కూల్ ఎదురుగా కారు(ఎపి 04బిజి 9035) ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News