- Advertisement -
నేరడిగొండ: గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొని ఓ యవకుడు మృతి చెందిన సంఘటన నేరడిగొండ మండలంలోని కుష్టి ఘాట్ వద్ద ఎన్‌హెచ్ 44 జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం జరిగింది . పొలీసులు,స్థానికులు తెలిపిన వివారల ప్రకారం … మండలంలోని వాగ్దరి గ్రామానికి చెందిన చౌవన్ ఆరవింద్ (23) రోజు మాదిరిగానే బైక్ పై తన భార్య తో కలిసి బావి వద్దకు వెళ్లాడు. అక్కడ సోలార్ పని చేయనందున అట్టి సోలార్‌ను రిపేర్ కొసం వెళ్లి తిరిగి వస్తుండగా మార్గ మద్యలో కుప్టి ఘాట్ వద్ద తన ముందున్న గుర్తు తెలియని వాహనంను ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతడికి తీవ్రగాయాలయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -