Sunday, December 22, 2024

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః రోడ్డు దాటుతున్న ఓ యువకుడిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…చందానగర్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఓ యువకుడు రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలోనే ఎంహెచ్43బిపి 4583 నంబర్ గల లారీ రోడ్డుదాటుతున్న యువకుడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న చందానగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చందానగర్ పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ కోసం వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News