Sunday, December 22, 2024

క్రికెట్ ఆడుతూ గుండె పోటుతో యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

హుస్నాబాద్: హుస్నాబాద్‌లో కర్ణకంటి మంజుల రెడ్డి క్రికెట్ టోర్నమెంట్‌లో ఆపశృతి చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతుండగా బౌలింగ్ వేస్తున్న క్రమంలో గుండెపోటుతో శనిగరం ఆంజనేయులు (37) అనే యువకుడు మృతి చెందాడు. స్దానికుల వివరాల ప్రకారం చిరుగుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన ఆంజనేయులు క్రికెట్ ఆడేందుకు తోటి స్నేహితులతో కలిసి హుస్నాబాద్‌కు వెళ్లాడు. అక్కడ క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు.

గమనించిన తోటి స్నేహితులు హుస్నాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆంజనేయులుకు వివాహమైంది. ఆయనకు బార్య, తల్లి ఉన్నారు. మృతుడి కుటుంబానికి పలువురు సానుభూతి ప్రకటించారు. మృతుడు ఆంజనేయులు తండ్రి గతంలో కూడా గుండెపోటుతో మృతి చెందినట్లు స్ధానికులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News