Monday, April 7, 2025

గణేష్ మండపం వద్ద డాన్స్ చేస్తూ యువకుడు మృతి..

- Advertisement -
- Advertisement -

గణేష్ మండపం దగ్గర డాన్స్ చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్ లో శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో చోటుచేసుకుంది. నిన్న(బుధవారం) రాత్రి గణేష్ మండపం వద్ద ప్రసాద్(26) అనే యువకుడు ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News