Sunday, December 22, 2024

చికిత్స పొందుతూ యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

బెజ్జంకి: ఎన్ని సార్లు ఆర్మీలో ఉద్యోగం సాధించాలని ప్రయత్నం చేసిన తనకు ఫలితం లేకుండా పోతుందనే బెంగతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం మండలం లోని చీలాపూర్ గ్రామానికి చెందిన తిప్పిరిశెట్టి విన య్(20) అనే యువకుడు డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్ద నానమ్మతో ఉంటు ఆర్మీ ఉద్యోగం కోసం రెండు సార్లు ప్రయత్నం చేసాడు. ఈసారి కూడా ప్రయత్నం చేసినా ఉద్యోగం రాకపోతే నాపరిస్థితి ఏమిటి

అని మనస్తాపంతో శుక్రవారం పురుగుల మందు తగడంతో గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.చికిత్స పొందుతూ శనివారం హాస్పిటల్ మృతి చెందాడని మృతిడి తల్లి మానసిక పరిస్థితి బాగలేకపోవడం,తండ్రి బతుకుదెరువు కోసం దుబాయ్‌లో ఉండగా మృతుని చిన్న బాపు తిప్పిరిశెట్టి రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఎల్లయ్య తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News