- Advertisement -
ఆర్టిసి బస్సు కిందపడి ఓ యువకుడు మృతిచెందిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…మేడ్చల్ జిల్లా, సత్యనారాయణపురానికి చెందిన దొంతురి వర్షిత్(23) బైక్‌పై వెళ్తుండగా బైక్ స్కిట్ కావడంతో కిందపడిపోయాడు. దీంతో వెనుక వస్తున్న ఆర్టిసి బస్సు అతడిపై వెళ్లడంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదించారు. కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -