వైరా రిజర్వాయర్ ఎడమ కాలువలో ప్రమాదవశత్తు బైక్‌తో సహ పడిపోయి వ్యక్తి మృతి చెందిన సంఘటన వైరా మండల పరిధిలోని గౌండ్ల పాలెం గ్రామంలో జరిగింది.స్ధానికులు,పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఎన్‌టీఆర్ జిల్లా పెనుగొలను గ్రామానికి చెందిన తోట వెంకటేశ్వరరావు(26)తన బంధువులు మట్ట వెంకటేశ్రవరావు,జిడుగు అయ్యప్పలతో కలిసి ఆదివారం అర్ధరాత్రి సొంత పనుల నిమిత్తం వేరు వేరు ద్విచక్ర వాహనాల మీద ఏనుకూరు మండలం సొమలగడ్డ గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్తున్నారు.
తోట వెంకటేశ్వరరావు బైక్‌కు గౌండ్ల పాలెం గ్రామం వద్దకు రాగానే మూల మలుపు వద్ద కుక్క అడ్డు రావటంతో కుక్కను తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కుడి వైపు ఉన్న రిజర్వాయర్ కుడి కాలువలో బైక్ పల్టి కొట్టింది.దీంతో వెంకటేశ్వరరావు తల కాలువ సైడ్ వాల్ బలంగా తగలటంతో వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు.తమతో పాటు వస్తున్న వెంకటేశ్వరరావు ఎంతకి తమ వెంట రాకపొంటంతో వెతికిన బంధువులు వెంకటేశ్వరరావు మృతదేహన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.ఈ ఘటనపై ఎస్‌ఐ అంకెవరపు వంశీకృష్ణ భాగ్యరాజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.