Saturday, December 21, 2024

చెట్టు కూలి యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి యువకుడి మృతి చెందిన సంఘటనా ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం చిన్నబోయినపల్లి కి చెందిన ఎస్ కే జహంగీర్ గ్రామంలో మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మందులు తీసుకు వచ్చేందుకు గురువారం మధ్యహ్నం 2.45 గంటలకు చిన్నబోయినపల్లి నుంచి

ఏటూరునాగారానికి జాతీయ రహదారి 163పై బైక్ పై వెళ్తుండగా మార్గమధ్యలో పెద్ద చెట్టు కూలి జహంగీర్ పై పడింది. ఈ ఘటనలో జహంగీర్ ఘటనస్థలిలోనే మృతి చెందాడు. అటుగా వెళ్తున్న స్థానికులు చూసి గ్రామస్థలకు విషయం తెలియజేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చెట్టును తొలగించి పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News