Tuesday, December 24, 2024

ఈతకు వెళ్లి యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

చందంపేటః కృష్ణా వెనుక జలాల్లో ఈతకు వెళ్లి నీటిలో మునిగి యువకుడి మృతి చెందిన సంఘటన శనివారం నేరెడుగొమ్ము మండలం వైజాగ్‌కాలనీ సమీపంలోని కృష్ణా వెనుక జలాల్లో చోటుచేసుకుంది. పోలీసలు తెలిపిన వివరాల ప్రాకారం.. త్రిపురం మండలానికి చెందిన చౌడోజి జ్యోతి, లక్ష్మణాచారి దంపతులకు ఏకైక కుమారుడు చౌడోజి భరత్‌చారి(24) వృత్తి రీత్యా హైదరాబాద్ నగరంలో కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శుక్రవారం తోటి మిత్రుతులతో కలిసి వచ్చిన భరత్‌చారి శనివారం వైజాగ్‌కాలనీ సమీపంలోని వెనుక జలాల్లో సరదా కోసం వచ్చారు.

ఈ క్రమంలో ఈత కొడుతున్న సమయంలో భరత్‌చారి నీటిలో మునిగిపోయాడు. గమనించిన మిత్రులు స్థానికులకు సమాచారం అందించి వారితో పాటు కృష్ణా నదిలో గాలిపులు చేపట్టారు. నీట మునిగిన భరత్‌చారిని బయటకు తీసుకురాగా అప్పటికే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News