- Advertisement -
హైదరాబాద్: తల్లి మందలించిందనే మనస్థాపంతో కూమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ లోని బాలానగర్ లో సోమవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. బాలానగర్ చెందిన సాయి కుమార్ (23) తల్లి మందలించిందని మనస్థాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
డబ్బుల విషయంలో తల్లి మందలించడంతో మనస్థాపం చెంది ఉరివేసుకొని మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్ మార్టమ్ నిమిత్తం మృతదేహన్ని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -